నవతెలంగాణ – జుక్కల్
లక్షలాది భక్తులు, శిష్యులు విశ్వసించే బండయప్ప మఠం మఠాధిపతి సోమయ్యప్ప స్వామీజీ పై హన్మంత్ షిండే చేసిన అనుచిత వ్యాఖ్యలు భక్తుల మనో భవాలను తీవ్రంగా గాయపరిచాయని, పార్టీలకతీతంగా వివిధ పార్టీలను నాయకులు అన్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలో ఆల్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, భక్తులు మాట్లాడుతూ.. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో హన్మంత్ షిండే అలాగే వారి అనుచరులు ఇదే సోమయ్య స్వామీజీ వద్దకు వచ్చి ఎన్నో వ్యక్తిగత ప్రజా సమస్యలపై పనులు చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అప్పుడు స్వామీజీ ఆశీస్సులు గుర్తుకు వచ్చి ఇప్పుడు మాత్రం అదే స్వామీజీ గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడడం ఏంటి అంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా జుక్కల్ మండల్ భక్తులు, ఆయా పార్టీల నాయకులు భారీగా పాల్గొన్నారు. అనంతరం మఠాధిపతి సోమప్పకు పాలభిషేకం చేశారు.



