నవతెలంగాణ – కామారెడ్డి
బీబీపేట్ మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు పరికి సూర్య తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సుభాష్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. అలాగే ఇటీవల కన్ను ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బీబీపేట్ గ్రామానికి చెందిన ఎంబరి గంగాధర్ ను సుభాష్ రెడ్డి కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవునిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనారోగ్యంతో ఉన్నారని తెలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు.
లింగుపల్లి గ్రామానికి చెందిన బికనూరు తిరుపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను సుభాష్ రెడ్డి ఓదార్చి సానుభూతి తెలిపారు. ఫరిద్‌పేట గ్రామానికి చెందిన వెంకట్రాజు గౌడ్ (ప్రస్తుత రామాయంపేట సీఐ) తండ్రి ఇటీవల స్వర్గస్తులైన నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి తో పాటు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి , జనగామ గ్రామ సర్పంచ్, బిబిపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మట్ట శ్రీనివాస్, బిబిపేట మండలం మాజీ వైస్ ఎంపీపీ కప్పెర రవీందర్ రెడ్డి, తుజాల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్, బిబీపెట్ గ్రామానికి చెందిన సాయి, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



