Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్తులను సన్మానించిన బోర్లం బసవన్న కమిటీ సభ్యులు

భక్తులను సన్మానించిన బోర్లం బసవన్న కమిటీ సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
బాన్సువాడ మండలంలోని బోర్లలో అతి పురాతనమైన బసవన్న ఆలయము పూర్వికులు నిర్మించారు. ఈ సందర్భంగా ఇక్కడ మొక్కులు తీసుకునేందుకు జుక్కల్ మద్నూర్ బిచ్కుంద మండలాల నుంచి భారీ సంఖ్యలో వీర శైవ లింగాయత్ లు భక్తులు భారీగా తరలివస్తుంటారు. నేడు ఆదివారం అమావాస్య కావడంతో శివాలయానికి భారీగా భక్తులు వచ్చి చేరారు. ఈ కార్యక్రమానికి అన్నదాతగా బసవన్న అన్న ప్రసాదం ఆవల్గావ్ గ్రామానికి చెందిన చీలావార్ సుకుమార్ పటేల్ ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు.

ఆలయానికి వచ్చిన వందలాది భక్తులకు మా అన్నదాని ప్రసాదం నైవేద్యంగా స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి చెందిన కమిటీ సభ్యులు జిల్లా ప్రసిడెంట్ కే . దిగంబర్ అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసిన శివకుమార్ను శాలువాతో సన్మానించి ఆలయ కమిటీ వారు బసవన్న ప్రవచనాల సంబంధించిన పుస్తకాలను , గ్రంథాలను అందించారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మారుతి పటేల్ , సూర్యకాంత్ పటేల్, బసవరాజ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -