Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా 

ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా 

- Advertisement -

సర్పంచ్ గోపాల్ ముదిరాజ్ 
నవతెలంగాణ – మిడ్జిల్ 

ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ గోపాలు ముదిరాజ్ అన్నారు. ఆదివారం బైరంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సీసీ రోడ్డుపనులు ఉప సర్పంచ్ కృష్ణ, గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా గ్రామంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజలు కూడా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంగయ్య, వార్డు మెంబర్లు ప్రసాదు, మురళి, గ్రామ పెద్దలు వెంకటయ్య, వెంకటయ్య గౌడ్, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -