- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని మద్దికుంటతో పాటు శ్రీ కాలభైరవ స్వామి ఆలయాల్లో మాఘమా అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మద్దికుంట లో వెలిసిన శ్రీ స్వయంభు గ్రామ లింగేశ్వర స్వామి ఆలయ కోనేటిలో భక్తులు మాఘమా స్నానాన్ని ఆచరించారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేసింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, పూజారులు ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



