అధ్యక్షునిగా చొప్పదండి ప్రకాష్ రెండోసారి గెలుపు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టౌన్ క్లబ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి ఇవి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి ప్రచారం నువ్వా నేనా అన్నట్లు చేశారు. టౌన్ క్లబ్ అధ్యక్ష ఎన్నికల్లో చొప్పదండి ప్రకాష్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి చొప్పదండి ప్రకాష్ గుడ్ల శ్రీనివాస్ లు పోటీ పడగా ప్రకాష్ కు 100 ఓట్లు రాగా గుడ్ల శ్రీనివాస్ కు 77 ఓట్లు వచ్చాయి ఒక ఓటు చెల్లలేదు. 23 ఓట్ల మెజారిటీతో ప్రకాష్ గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి కోడం శ్రీనివాస్ నీలి శ్రీనివాస్ లు పోటీ పడగా కోడం శ్రీనివాస్ కు 115 ఓట్లు రాగా నీలి శ్రీనివాస్ కు 58 ఓట్లు వచ్చాయి.
ఐదు ఓట్లు చేల్లకపోగా 57 ఓట్ల మెజారిటీతో కోడం శ్రీనివాస్ గెలుపొందారు గెలుపొందారు ప్రధాన కార్యదర్శి పదవికి చేపూరి శ్రీనివాస్ పులి దేవదాస్ లు పోటీ పడగా చేపూరి శ్రీనివాస్ కు 131 ఓట్లు పులి దేవదాస్ కు 4 ఓట్లు వచ్చాయి ఏడు ఓట్లు చెల్లకపోగా చేపూరి శ్రీనివాస్ 91 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శి పదవికి ఇరుకుల్ల భాస్కర్ ప్రయాకర్ రావు వేణు లు పోటీ పడగా ఇరుకుల్ల భాస్కర్ కు 136 ఓట్లు రాగా ప్రయాకర్ రావు వేణుకు 36 ఓట్లు వచ్చాయి. ఆరు ఓట్లు చెల్లకపోగా 100 ఓట్ల మెజారిటీతో భాస్కర్ గెలుపొందారు.
కోశాధికారి పదవికి వైద్య శివప్రసాద్ సామల శ్రీనివాస్ లు పోటీ పడగా వైద్య శివప్రసాద్ కు 123 ఓట్లు సామల శ్రీనివాస్ కు 52 ఓట్లు రాగా మూడు ఓట్లు చెల్లకపోగా 71 ఓట్ల మెజారిటీతో వైద్య శివప్రసాద్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. చొప్పదండి ప్రకాష్ ప్యానెల్ మొత్తం గెలవడంతో టౌన్ క్లబ్ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. గెలుపొందిన పానెల్ సభ్యులకు పలువురు సన్మానాలు చేశారు.



