- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
ఫార్మా కంపెనీకి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం తీసుకున్న తీర్మానాన్ని బిక్నూర్ గ్రామ యువత స్వాగతించింది. గ్రామ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల భద్రత కోసం తీసుకున్న ధైర్యమైన నిర్ణయమని యువత పేర్కొంది. ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా ప్రజల పక్షాన నిలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను యువత అభినందించారు. ఈ తీర్మానం గ్రామ ఐక్యతకు నిదర్శనమని, ప్రజాస్వామ్యానికి గెలుపని యువత వ్యాఖ్యానించారు. గ్రామ హితం, ప్రజల ఆరోగ్యం కోసం జరిగే ప్రతి పోరాటంలో తాము ముందుండి గ్రామపంచాయతీకి అండగా ఉంటామని యువత స్పష్టం చేశారు.
- Advertisement -



