కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు గుగులోతు భారతీ దేవేందర్
నవతెలంగాణ – నెల్లికుదురు
నెల్లికుదురు మండల కేంద్ర సర్పంచ్ పులి వెంకన్న దంపతుల కు శాలువాతో ఘనంగా సత్కరించినట్లు కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు గుగులోతు భారతి తెలిపారు. ఆదివారం గ్రామస్తులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి భూకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషిచేసి నేడు మండల కేంద్ర సర్పంచిగా అధిక మెజార్టీతో గెలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూక్య జగన భూక్య శ్రావణ్, భూక్య రామచందర్, గుగులోతు వెంకన్న, ఇస్లావత్ బిచ్య, తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ పులి వెంకన్నకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


