Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీలో చేరిన బాల్కొండ ఉప సర్పంచ్ 

కాంగ్రెస్ పార్టీలో చేరిన బాల్కొండ ఉప సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్ , వార్డు మెంబర్ మహమ్మద్ ఫాజిల్ ఉద్దిన్ లు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జలాల్ పూర్ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి, బాల్కొండ వార్డ్ మెంబర్లు దయాకర్, నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, వేల్పూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ ఖాన్, నాయకులు యూనుస్, కుందారం శ్రీనివాస్, వహాబ్, నల్లూరి హరికృష్ణ, ప్రవీణ్ గౌడ్, మజార్, రియాజ్, సల్లావుద్దీన్, పద్మారావు, పిప్పర అశోక్, సంతోష్ గౌడ్, తేజ , బిట్టు గోపు ఉశన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -