- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
నట సార్వభౌమ,మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి ని పురస్కరించుకుని ఆదివారం తెలుగు దేశం పార్టీ ఆద్వర్యంలో ఆ పార్టీ నియోజక వర్గం నాయకులు కట్రం స్వామి దొర నేతృత్వంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. అశ్వారావుపేటలోని మూడు రోడ్ల ప్రధాన కూడలి లో గల ఎన్టీఆర్ భారీ విగ్రహానికి పూలమాల నివాళి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



