నవతెలంగాణ – హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, శాంతిభద్రతల బలోపేతంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, నగరవాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో పలువురు యువ ఐపీఎస్ అధికారులను కీలక స్థానాల్లో నియమించింది. ఈ బదిలీలపై తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ.. “నగర పాలనను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి. అందులో భాగంగానే నగరవాసుల ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక, స్థిరమైన పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టాం” అని తెలిపారు. క్షేత్రస్థాయిలో మంచి పనితీరు కనబరిచిన యువ, డైనమిక్ ఐపీఎస్ అధికారులకు ట్రాఫిక్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు ఆయన వివరించారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పర్యవేక్షణకు యువ ఐపీఎస్ ఆఫీసర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



