నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలో ఆదివారం టిడిపి మండల అధ్యక్షులు దోమల వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వృద్ధులకు, అనాధలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలే మల్లయ్య,మండల బీసీ సెల్ అధ్యక్షులు కాసర్ల అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరాములు, దేవరకొండ సత్తయ్య, వీరమల్ల మల్లేష్, వార్డ్ మెంబర్ బరిగల గణేష్, టి.వెంకటేష్, కే రాములు, నగేష్, ఏర్పుల శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



