Monday, January 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫిబ్రవరి 12న సమ్మెలో పాల్గొంటాం

ఫిబ్రవరి 12న సమ్మెలో పాల్గొంటాం

- Advertisement -

జనవరి 22న డిమాండ్స్‌ డే : టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు 2026 ఫిబ్రవరి 12న ఒక్క రోజు తలపెట్టిన జాతీయ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఎస్‌ డబ్ల్యూఎఫ్‌ విస్తృత స్థాయి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం తీర్మానించింది. అలాగే టీఎస్‌ఆర్టీసీలో పని చేస్తున్న అన్ని సంఘాలను సంప్రదించి సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా సమ్మె నోటీసులు ఇచ్చే విధంగా కోరేందుకు ఎస్‌ డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కేంద్రం భాధ్యత తీసుకోవాలని కూడా సమావేశం నిర్ణయించింది. ఇతర కార్మిక సంఘాల నుండి కలిసి వచ్చే వారితో చర్చించిన అనంతరం ఒక కరపత్రం, పోస్టర్‌ తీసుకొని రావాలనీ, సీఐటీయూ రాష్ట్ర కమిటీ తీసుకొస్తున్న రెండు బుక్లెట్స్‌ ( శ్రమశక్తి నీతి- 2025, లేబర్‌ కోడ్స్‌పై)ను కార్మికులకు అమ్మడం ద్వారా కాంపెయిన్‌ చేయాలని సమావేశం నిర్ణయించింది. కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేసేందుకు అన్ని రీజియన్‌ కమిటీ/ డిపో కమిటీ సమావేశాలు జరపాలనీ, అన్ని స్థాయిల్లో జనరల్‌ బాడీలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
టీఎస్‌ఆర్టీసీలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జనవరి 22న ” డిమాండ్స్‌ డే గా పాటించాలనీ, ఆరోజున డిమాండ్స్‌ ముద్రించిన బ్యాడ్జెస్‌ ను ధరించి విధులకు హాజరు కావాలని ఎస్‌ డబ్ల్యూఎప్‌ పిలుపునిచ్చింది. విస్తత స్థాయి రాష్ట్ర కమిటీ చేసిన నిర్ణయాలు అన్ని స్థాయిల కమిటీ లు అమలుకు కషి చేయాలనీ సమావేశం కోరింది. ఈ సమావేశంలో టీఎస్‌ఎస్‌ డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ఎస్‌.రావు తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్స్‌ డే రోజు నాటి డిమాండ్స్‌ ఇవే
1) టీఎస్‌ఆర్టీసీలో యూనియన్‌లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు ఎన్నికలు జరపాలి.
2) కేంద్రం తెచ్చిన 4 లేబర్‌ కోడ్‌లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.
3) కేంద్ర విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పు చేసి, ప్రభుత్వమే విద్యుత్‌ బస్సులు కొని ఆర్టీసీకి ఇవ్వాలి.
4) ప్రజలు, ఆర్టీసీపై భారాలు మోపే విద్యుత్‌ సవరణ బిల్‌-2025ను ఉపసంహరించుకోవాలి.
5) ఎంవి యాక్ట్‌-2019 లో అవసరమైన సవరణలు చేయాలి.
6) 2021,2025 వేతన సవరణలు అమలు చేయాలి. 2017 వేతనాల ఆధారంగా అలవెన్సులు పెంచాలి.
7) రిటైర్‌ అయిన కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి.
8) 29 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -