Monday, January 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాకిస్తాన్‌లో ఘోరం

పాకిస్తాన్‌లో ఘోరం

- Advertisement -

షాపింగ్‌మాల్‌లో అగ్ని ప్రమాదం..
ముగ్గురు మృతి
ఇస్లామాబాద్‌ :
పాకిస్తాన్‌లో షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 12మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని సీనియర్‌ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని దక్షిణ సింధ్‌ ప్రావిన్స్‌ రాజధాని కరాచీలోని గుల్‌ప్లాజాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మాల్‌లో దిగుమతి చేసుకున్న దుస్తులు, ప్లాస్టిక్‌ గృహోపకరణాలను నిల్వ చేసిన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దుస్తులు, ప్లాస్టిక్‌ వస్తువుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది గుల్‌ ప్లాజాకు చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి వుంది. కరాచీ, దేశంలోని చాలా నిర్మాణాల్లో అగ్నిమాపక వ్యవస్థలు లేవని, వీటివల్ల తరచుగా నష్టాలు, ప్రాణనష్టం జరుగుతోందని అధికారులు ఆ ప్రకటనలో వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -