– సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, కూలీలు, పేదల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాల డుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు విలేకర్లతో మాట్లాడారు.
ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు అదానీ, అంబానీ వంటి బడా పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నదని విమర్శించారు. మరో వైపు అత్యంత ప్రమాదక రమైన నాలుగు లేబర్ కోడ్స్ అమలు, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, వీబీ జీ రామ్ జీ చట్టం, బీమా రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి, అణురంగంలోకి ప్రయి వేటు కంపెనీలకు అనుమతినిస్తూ కేంద్రం చట్టాలను చేస్తున్నదని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శలు, సభలు నిర్వహించాలని కోరారు. ఈ ప్రదర్శనలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
నేడు జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, సభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



