ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా ఒక అరుదైన ఘనత సాధించబోతున్నారు. ప్రపంచంలోని నెంబర్ వన్ విద్యా సంస్థల్లో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ”లీడర్‌షిప్: 21 సెంచరీ” అనే కోర్స్‌కు ఆయన హాజరుకాబోతున్నట్టు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో, భారతదేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ కార్యక్రమానికి హాజరవుతున్న మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానున్నారు. ఈ కోర్స్ పేరు – ”21వ శతాబ్దం కోసం నాయకత్వం (అస్తవ్యస్తత, సంఘర్షణ, ధైర్యం)”. ఈ కోర్స్ కోసం ఆయన ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్‌లోని కెనడీ స్కూల్ క్యాంపస్‌లో ఉండి తరగతులకు హాజరవుతారు. ఐదు ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ కోర్సుకు హాజరు కాబోతున్నారు. వీరితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్ మెంట్‌లు, హౌమ్‌వర్క్‌లు పూర్తి చేసి గ్రూప్ ప్రాజెక్టులు కూడా నిర్వహిస్తారు. ఈ కోర్సుకు ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రియాన్ చైర్మెన్ గా ప్రొఫెసర్ కరెన్ మోరిసీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కోర్సులో భాగంగా ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాల నుంచి కేస్ స్టడీలను విశ్లేషించి, పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. కోర్స్ పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ పొందనున్నారు.
హార్వర్డ్ విద్యార్థిగా రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



