రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-ములుగు/గోవిందరావుపేట
ములుగు జిల్లా మేడారం జారతను సందర్శించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా రవాణా వ్యవస్థను పటిష్టం చేసినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉత్తర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలను కలుపుకొని నాలుగు వేలకు పైగా బస్ సర్వీసులను మేడారం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గతంలో జరిగిన మేడారం జాతర వేరు, ప్రస్తుతం జరుగుతున్న జాతర వేరని ప్రజలే గుర్తించాలన్నారు.
మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం కాబట్టి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జాతరను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో మేడారంలోనే తిష్ట వేసి మంత్రుల సమావేశం సైతం నిర్వహిస్తూ సర్వం సిద్ధంగా ఉంచామని తెలిపారు. గత పాలక ప్రభుత్వాలు రూ.100కోట్లు ఖర్చు చేయడానికి వెనకా ముందు చేసేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ.250కోట్లకు పైచిలుకు ఖర్చు చేసి జాతరను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతర సక్సెస్ కోసం ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోందని, ప్రజల సహకారంతో నూటికి నూరు శాతం సక్సెస్ చేస్తామని అన్నారు.
మేడారం భక్తులకు సౌకర్యంగా రవాణా వ్యవస్థ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


