Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు

విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిటైర్డ్ ఎంఈఓ గుండోజి దేవేందర్ సోమవారం అమెరికాలోని తన మనవరాలి కోరిక మేరకు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రతి తరగతిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు మొదటి, రెండవ బహుమతులుగా బాక్సులను ప్రధానం చేశారు. 2026వ సంవత్సరంలో పదవ తరగతి పరీక్ష రాయబోయే విద్యార్థులందరికీ ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంఈఓ గుండోజి దేవేందర్ మాట్లాడుతూ.. కష్టపడి బాగా చదివి పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. వచ్చే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు మనీ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -