Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రధాని మోడీని గద్దె దించాలి

ప్రధాని మోడీని గద్దె దించాలి

- Advertisement -

రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ – కామారెడ్డి

రైతు, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ రైతు సంఘం నాయకులు మోతీరాం నాయక్, వెంకట్ గౌడ్, పి. జయదేవ్, దొడ్ల మోహన్ తదితరులు మాట్లాడుతూ.. విత్తనాల ధరలు పెరుగుతున్నా, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలను మరింత సంక్షోభంలోకి నెట్టిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్య ప్రజలు జీవనం కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి పాలన కొనసాగించే హక్కు పాలకులకు లేదని, రాబోయే రోజుల్లో పోరాటాలే ఏకైక పరిష్కారమని వారు స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో కార్మికుల హక్కులను కాలరాశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పి. నరేష్, రైతులు సాయిలు, సంగవ్వ, సుకన్య, గంగామని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -