ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. మొత్తం దరఖాస్తులు 109 వచ్చాయి. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు అందించి, నిర్ణిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
పరిహారం చెక్కు అందించిన ఇంచార్జి కలెక్టర్..
సెర్ప్ లో సీసీ గా విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిహారం చెక్కును అందజేశారు. ఇల్లంతకుంట మండలంలో సెర్ప్ లో సీసీ సదయ్య మరణించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ స్త్రీనిధి ద్వారా రూ. లక్ష 50 వేల పరిహారం చెక్కును సదయ్య భార్య మంద సరళ కు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. కార్యక్రమంలో గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ గీత, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, స్త్రీనిధి ఆర్ఎం భూ కైలాస్ తదితరులు పాల్గొన్నారు.



