Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడల్ స్కూల్లో దరఖాస్తుల స్వీకరణ.!

మోడల్ స్కూల్లో దరఖాస్తుల స్వీకరణ.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
2026-27 విద్యా సంవత్సరానికి గాను మండలంలోని ఎడ్లపల్లి మోడల్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్రావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతి,7వ తరగతి నుంచి 10వ తరగతి ఖాళీ సీట్లకు ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 9న హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఏప్రిల్ 19న 6వ తరగతి విద్యార్థులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, 7వ తరగతి నుంచి 10వ తరగతి ప్రవేశాలకు మధ్యాహ్నం 2 గం టల నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరుగు తాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -