- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు
ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు విద్యాభ్యాసం పూర్తి అయ్యేంతవరకు ఎస్బిఐ ఆశా స్కాలర్ షిప్ 2025 కు మునుగోడు మండలంలోని కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులు ఎస్ లక్ష్మీ ప్రసన్న, యామిని ఎంపిక అయ్యారు. సోమవారం ఆ విద్యార్థులు రూ.15వేల స్కాలర్ షిప్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడపూర్ వెంకటనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ప్రతి విద్యార్థుల పట్టుదల అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -



