– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో సీఎం కప్ క్రీడలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కప్ 2026 క్రీడలను మండల, గ్రామ స్థాయిలో నిర్వహణ, విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సీఎం కప్ క్రీడలను మండల స్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు మండల విద్యాధికారి, గ్రామ స్థాయిలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయం చేసుకొని క్రీడలను విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, క్లస్టర్ ఇన్చార్జెస్ ఫిజికల్ డైరెక్టర్లు, సిఅర్పి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



