Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ముగ్గు వేసి ప్రారంభించిన సర్పంచ్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ముగ్గు వేసి ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలోని లాల్ సాబ్ గల్లీలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల కొరకు సోమవారం గ్రామ సర్పంచ్ సావిత్ర సాయ గౌడ్ ఆధ్వర్యంలో జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ముగ్గు వేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో మంజూరైన ఇందిరమ్మ గృహ పథకాల లబ్ధిదారులు ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు.

వాటికి సంబంధించిన అనుమతులు దరఖాస్తు పెట్టుకోగానే పరిశీలించి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న గృహ నిర్మాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మనోజ్, బొంపల్లి వారి విజయ్ కుమార్, కంచెన్ వార్ సుభాష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -