నవతెలంగాణ – ఆలేరు రూరల్
ప్రజాస్వామ్యం కాపాడడంలో పత్రికల పాత్ర చాలా ముఖ్యమైందని ఆలేరు తాసిల్దార్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆలేరు తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం నవతెలంగాణ కోర్టు క్యాలెండర్ ఆలేరు రూరల్ రిపోర్టర్ పోతుగంటి సంపత్ కుమార్ తో కలిసి నవతెలంగాణ కోర్టు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ నవతెలంగాణ దినపత్రిక పేద ప్రజల పక్షాన నిలబడుతుందని వాస్తవాలను ప్రజా ప్రతినిధుల అధికారుల దృష్టికి తీసుకురావడంలో పత్రిక యజమాన్యం సిబ్బంది రిపోర్టర్లు చేస్తున్న కృషిని కొనియాడారు. లాభ అపేక్ష కోసం వ్యక్తులచే నడుస్తున్న పత్రికలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కేవలం నవతెలంగాణ దినపత్రిక ప్రజలే యాజమాన్యులు గా కార్మిక, కర్షక, అణగారిన ప్రజల కోసం సమస్యలను ప్రచురిస్తున్న దినపత్రిక అన్నారు. కోర్టు క్యాలెండర్ సైజు చాలా పెద్దగా ఉండడం చూసి దూరం నుండైనా కనిపించే విధంగా ఉందన్నారు.
నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన తహశీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



