మేడారం ప్రాంతంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడం హర్షనీయం
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్
నవతెలంగాణ- నెల్లికుదురు
గతంలో ఎవరు ఏ పార్టీ నిర్వహించని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాన్ని మేడారం జాతర పురస్కరించుకొని ఈ ప్రాంతంలో పెట్టడం హర్షిoచా దగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక కోట్లాది రూపాయల నిధులను కేటాయించి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
ఇప్పుడు జరుగుతున్న మేడారం జాతరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి మంత్రివర్గం సీఎం అందరూ కలిసి వచ్చి ఈ ప్రాంతంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించి ప్రతి రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి గడప గడప అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి గడపకు చీర వేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణను పూర్తిస్థాయిలో అన్ని రంగాలుగా ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ తుప్పతూరి రాజు లింగ్యా నాయక్ తో పాటు కొంతమంది ఉన్నారు.



