Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ప్లాట్లు విక్రయిస్తే స్వాధీనం చేసుకోవాలి 

ప్రభుత్వ ప్లాట్లు విక్రయిస్తే స్వాధీనం చేసుకోవాలి 

- Advertisement -

తిరిగి పేదలకే పంచాలి ఎమ్మార్వో కు వినతి 
నవతెలంగాణ – ఆలేరు రూరల్

పేదలకు ఇచ్చిన ప్లాట్లను మధ్య దళారులు కమిషన్ల కోసం ఆశలు పెట్టి కారు చౌకగా అమ్మకాలు చేయిస్తున్నారని గొలనుకొండ ప్లాట్ల సాధన కమిటీ కన్వీనర్ తీగల వెంకటేష్ ఆరోపించారు. ఆలేరు మండలం కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం ఇచ్చి మాట్లాడారు. గోలనుకొండ గ్రామంలో గత 20 సంవత్సరాల క్రితం ఇల్లు లేని పేదలకు సర్వేనెంబర్ 42, 272 లో 212 మంది పేదలకు అప్పటి ఎమ్మార్వో పట్టాలు పంపిణీ చేశారని చెప్పారు. గత సంవత్సరం అనేక పోరాటాల ఫలితంగా లేఔట్ చేసి తాసిల్దారు సర్వేర్ ప్లాట్లకు హద్దులు పాతి లబ్ధిదారులకు ఇచ్చారని తెలిపారు. ప్లాట్లు తీసుకున్న పేదల ఆర్థిక పరిస్థితులను ఆసరా చేసుకుని మధ్య దళారులు వారికి ఆశలు చూపెట్టి కమిషన్ల కోసం ప్లాట్లను ఇతరులకు విక్రయిస్తున్నారని ఎమ్మార్వోకు వివరించారు.

లబ్ధిదారునికి ఇచ్చిన సర్టిఫికెట్ లోనే ప్లాట్ లని కొనుట అమ్ముట నేరమని ఒకవేళ అలా ఎవరైనా కొనుగోలు చేస్తే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ఉందని ప్రకటన ఉందన్నారు. అమాయకులు ఇవేమీ తెలియక రూ.100 బాండ్ పేపర్ మీద రాసుకొని కొనుగోలు చేస్తున్నారని అలాంటివారు నష్టపోతారని చేతులు జోడిచ్చి మొక్కుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్లను ఎవరు కొనుగోలు చేయొద్దని చేసినట్లయితే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గ్రామంలోనికి పేదలకు తిరిగి ఇచ్చే విధంగా ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని కోరారు. గ్రామంలో ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చెయ్యాలనుకుంటే ఎమ్మార్వో అనుమతి తీసుకోవాలన్నారు.

అలా చెయ్యకపోతే తహసీల్దార్ దృష్టికి ఎవరు తీసుకువచ్చినా ఆ ప్లాట్ ను రద్దు చేసేందుకు చర్య తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కమిటీ సభ్యుడు సంఘీ రాజు చిట్యాల సుధాకర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -