ప్రైజ్‌మనీ రూ.100 కోట్లు!

– బిడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌
కౌలాలంపూర్‌ : ప్రపంచ అత్యంత ధనిక బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ మరింత ధనికం కానుంది. ఏడాది చివర్లో జరిగే ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ నగదు బహుమతిని రానున్న నాలుగేండ్లలో రూ. 100 కోట్లు (11.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు)కు పెంచనున్నారు. ఈ మేరకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది విజేతలకు రూ. 20 కోట్లు పంచనుండగా, వచ్చే ఏడాది ఆ మొత్తాన్ని రూ. 30 కోట్లకు పెంచను న్నారు. 2027 వరకు ఓవరాల్‌ ప్రైజ్‌మనీ మొత్తం సుమారు రూ. 100 కోట్లకు పెంచనున్నారు. ఈ ఏడాది వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ డిసెంబర్‌ 13-17న హాంగ్జౌలో జరుగనుంది.

Spread the love