Monday, January 19, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించను

- Advertisement -

ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
నవతెలంగాణ – ముధోల్
ప్రభుత్వంనికి చెడ్డ పేరు తేస్తే సహించను అని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. వసంత పంచమి వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తో కలిసి సోమవారం సాయంత్రం బాసరలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వసంత పంచమి రోజు క్యూలైన్ లో ఉన్న భక్తులకు తాగునీరు సక్రమంగా అందించే విధంగా చూడాలన్నారు.

గతంలో  తాగునీరు సక్రమంగా అందించకపోవటాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమావేశంలో ఎత్తిచూపారు. అలాగే చిన్నపిల్లలకు కనీసం పాలు సరిపడే విధంగా అందించటం లేదన్న ఆరోపణలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రస్తావించారు.తక్కువ పాలు తీసుకొచ్చి ఎక్కువ రాసి బిల్లులు పొందడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ప్రజా ప్రతినిధిగా ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే  చెప్పారు. జిల్లా కలెక్టర్ కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. లేని యెడల చర్యలు తప్పవని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -