Monday, January 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రంక్ అండ్ డ్రైవ్ – రోడ్డు భద్రతపై అవగాహన

డ్రంక్ అండ్ డ్రైవ్ – రోడ్డు భద్రతపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు
డ్రంక్ అండ్ డ్రైవ్ – రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడు అవగాహన కల్పించుకోవాలని ఎస్సై చిర్రా రమేష్ బాబు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, నెల్లికుదురులో పోలీస్ శాఖ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో “డ్రంక్ అండ్ డ్రైవ్ – రోడ్డు భద్రత” అంశాలపై ప్రత్యేక అవగాహన సమావేశం సోమవారం  డ్రంక్ అండ్ డ్రైవ్ – రోడ్డు భద్రత పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై చిర్రా రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం సేవించి వాహనం నడపడమేనని, ఇది కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదకరమైన అలవాటని అన్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితకాల నష్టానికి దారితీస్తుందని, యువత ముందుగా మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, అతివేగం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన వంటి అంశాలు కూడా ప్రమాదాలకు దారితీస్తాయని వివరించారు. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు దేశవ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని ప్రతి సంవత్సరం వేలాది మంది తమ ప్రాణాలను కోల్పోతుండగా, లక్షలాది మంది శాశ్వత వికలాంగతకు గురవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో “Arrive Alive” (సురక్షితంగా చేరుకోండి) అనే నినాదం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు. అనంతరం కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం మర్సకట్ల అనిల్ కుమార్ లు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు లైసెన్స్‌తోనే వాహనం నడపాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను గౌరవించాలని సూచించారు.

జీబ్రా క్రాసింగ్, స్పీడ్ లిమిట్స్‌ను గౌరవించాలని, పాదచారుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ఆదర్శంగా  నిలవాలని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రకాష్ బాబు, కవిరాజ్, నాగేశ్వరావు, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, బాబు, సతీష్ అధ్యాపకేతర బృందం లక్ష్మణ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -