Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ పోరుకు దూకుడు

మున్సిపల్ పోరుకు దూకుడు

- Advertisement -

ప్రధాన రాజకీయ నాయకుల సమావేశాలు 
నవతెలంగాణ – ఆర్మూర్   

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రచార పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నేడు జిల్లా కేంద్రంలోని జరిగే సమావేశంలో పాల్గొని, వెంకటేశ్వర కాలనీలోని అందుబాటులో ఉండనున్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సైతం పలు గ్రామాలలో పర్యటిస్తూ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.

బిఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం పట్టణంలోని పెర్కిట్ ఎంఆర్ గార్డెన్ యందు నిర్వహించనున్నారు. పట్టణ బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో సమావేశంకలదు ఇట్టి సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి  ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సురేషరెడ్డి , బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సి వీజీ గౌడ్ తదితరులు పాల్గొననున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -