Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్
రాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త, యువ రైతు మహమ్మద్ గౌస్ ఇటీవల విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ తో ఫోన్ లో మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదం కింద వచ్చే పరిహారాన్ని తొందరగా వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు.

బీఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన గౌస్ విద్యుత్ షాక్ తో మరణించడం ఎంతో బాధ కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. పరామర్శించిన వారిలో ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, మాజీ జడ్పిటిసి యాదగిరి, మంతూర్ సర్పంచ్ ఫర్వేజ్ అహ్మద్,ఎల్కల్ సర్పంచ్ పిట్ల వెంకటయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్  పడగంటి శ్రీనివాస్ గుప్త, సీనియర్ నాయకులు సీతారాం రెడ్డి, ఇప్ప దయాకర్, సందీప్ రెడ్డి, గల్వ దయాకర్ రెడ్డి, మౌలానా, బాబా తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -