Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్పందించకుంటే నల్ల జెండాలతో ఎమ్మెల్యేను అడ్డుకుంటాం.. 

స్పందించకుంటే నల్ల జెండాలతో ఎమ్మెల్యేను అడ్డుకుంటాం.. 

- Advertisement -

– మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ లోనే కొనసాగించాలి
– కల్వకుర్తి తాలుకను నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలి
– ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన ప్రకటనను వెనకకు తీసుకోవాలి
– నల్లా జెండాలతో అఖిలపక్ష జేఏసీ నాయకులు
నవతెలంగాణ – ఊరుకొండ 

అసెంబ్లీ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. ఎమ్మెల్యే స్పందించకుంటే నల్ల జెండాలతో అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని జేఏసీ నాయకులు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్, తాడెం చిన్నా లు అన్నారు. సోమవారం ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జేఏసీ నాయకులు, మాజీ సర్పంచ్ వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ అధ్యక్షతన అఖిలపక్ష జెఏసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 10వరోజుకు చేరుకున్నాయి.

 10వరోజు దీక్షలో భాగంగా జేఏసీ నాయకులు నల్లజెండాలు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఊరుకొండ మండలంలోని ప్రజలందరూ ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఊరుకొండ మండల ప్రజలు ఓట్లేస్తే గెలిచి ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఊరుకొండ మండల ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే అయి రెండు సంవత్సరాలు దాటిన ఊరుకొండ మండలానికి ఒరగబెట్టింది ఏమీలేదని.. అభివృద్ధి కార్యక్రమాల మీద చిత్తశుద్ధి లేదని.. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజల ఓట్లకొరకు కనీస అవగాహన లేకుండా.. ప్రజల అభిప్రాయం లేకుండా..మీ ఇష్టానుసారంగా.. అసెంబ్లీ సాక్షిగా కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేసి నా ఊరుకొండ మండలాన్ని కల్వకుర్తి లో కలిపి అదేవిధంగా నాగర్ కర్నూల్ ను జిల్లాగా చేసి  జడ్చర్లకు అన్యాయం చేశారని మాట్లాడడం వారి స్వార్థ ప్రయోజనాల కొరకే అని స్పష్టం చేశారు.

మండలంలో కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ బుద్ధి తోటి మాట్లాడడం పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ విషయంపై  ఎమ్మెల్యే స్పందించకుండా.. కొంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యే మెప్పు పొందడానికి కుట్రలు చేస్తున్నారని.. అట్లాంటి వారికి రాబోవు కాలంలో ఊరుకొండ మండల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. దీనిపైన స్పందించకుంటే అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో శ్రీ ఊరుకొండ పేట అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు, రథోత్సవానికి వచ్చినప్పుడు (నల్లజెండాలతోటి) అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఊరుకొండ మండలాన్ని కల్వకుర్తి డివిజన్ నుండి విడదీయకుండా ఉండాలంటే మండలంలోని ప్రతి గ్రామం నుండి ప్రజలు, రాజకీయ నాయకులు, కులసంఘాల నాయకులు స్వచ్ఛందంగా నల్లజెండాలతో ఎమ్మెల్యేను అడ్డుకోవడానికి భారీ ఎత్తున తరలిరావాలని అఖిలపక్ష జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తాడేం చిన్న, బుడుమ జంగయ్య, రాజ్ నారం రెడ్డి, పయ్యావుల జంగయ్య, బండారి శివుడు, శ్రీనివాసులు, పవన్ కల్యాణ్, చిన్నబాలకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -