Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురికి జైలు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురికి జైలు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్    
స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో  దొరికిన నలుగురిని  (4)  కోర్టులో హాజరు పరచగా, ( 3) ముగ్గురిని ఒక్కొక్కరికి జిఎఫ్సిఎం మేజిస్ట్రేట్ భావ్యశ్రీ ఏడు రోజుల (7) సాధారణ శిక్ష విధించినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ సోమవారం తెలిపారు. పట్టణానికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాస్ , గుంజ కోటేశ్వరరావు , భూ రెడ్డి కొండారెడ్డి లకు ఒక్కరికి (1) రూ.10000/-జరిమానా సైతం  విధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ.. వాహనదారులు  తమ వాహనాలకు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనదారులకు మోటార్ వెహికల నూతన చట్ట ప్రకారం భారీగా జరిమాణాలు పెంచిందని తెలిపారు. వాహనదారులు విధిగా ధ్రువపత్రాలు తమ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -