రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈనెల 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
-మా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా హ్యాపీ. ఆంధ్ర మొత్తం ఆల్మోస్ట్ అయింది. ఇది లాంగ్ వీకెండ్. సోమవారం కూడా హాలిడే. నైజంతో పాటు మిగతా ఏరియాల్లో కూడా అయిపోతాయి. ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
-రెగ్యులర్ రవితేజ సినిమాలా కాకుండా పండగకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లాగా తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని ప్రారంభించాం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌కి సంక్రాంతి సీజన్‌లో డిమాండ్ ఉంటుందని ఈ సంక్రాంతితో మరోసారి రుజువైంది.
-పండగకి వచ్చిన అన్ని సినిమాలు కూడా విజయాలు సాధించడం. అరుదైన గొప్ప విషయం. వచ్చిన ఐదు సినిమాలు కూడా అద్భుతంగా ఆడాయి. సంక్రాంతికి చిరంజీవి సినిమా ఫస్ట్ ఆప్షన్. అందరూ ఆ సినిమాని చూసేశారు. ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి మిగతా సినిమాల రన్ కూడా అద్భుతంగా ఉండబోతుంది. రవితేజతో పని చేయడం ఇది రెండోసారి. మొదటిది అనుకున్నంతగా రాలేదు. ఇది మాత్రం మేము ఏదైతే అనుకున్నామో అన్ని ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.
-‘పారడైజ్’ సినిమాని మార్చిలోనే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. చిరంజీవి సినిమా ‘పారడైజ్’ అయిపోయిన వెంటనే మొదలుపెడతాం. అది పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ కథ. దుల్కర్‌తో సినిమా, అలాగే కిషోర్ తిరుమలతో ఒక లవ్ స్టోరీ చేయబోతున్నాం. నటీనటులు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. నాకు ‘అరుంధతి’ లాంటి సినిమా చేయాలని ఉంది. దానికి సంబంధించి కథా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
మరోసారి రుజువైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


