నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన యల్లా సాయిరెడ్డిని సోమవారం నియోజకవర్గ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైస్ మల్లారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు శశి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యల్లా సాయిరెడ్డిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్పంచులంతా ఐక్యతతో పనిచేస్తే గ్రామాల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి గ్రామ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సర్పంచుల హక్కులు, గ్రామాల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఆలూర్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా యల్లా సాయిరెడ్డి ఎన్నిక కావడం మండలానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి మరింత ఊపొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచులందరికీ అండగా నిలుస్తారనే పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ్, సతీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


