- Advertisement -
– 19 నుండి 22 వరకు పంచాయితీ స్థాయి
– 28 నుండి 31 మండల స్థాయిలో
– ఎంపీడీఓ అప్పారావు
వతెలంగాణ – అశ్వారావుపేట
సీఎం కప్ క్రీడలు మండలంలో సోమవారం నుండి ప్రారంభం అయ్యాయని ఎంపీడీఓ అప్పారావు సోమవారం తెలిపారు. క్లస్టర్ స్థాయిలో ప్రతీ పంచాయితీ లోనూ ఈ 19 నుండి 22 వరకు స్థానిక సర్పంచ్ లు, కార్యదర్శులు, పాఠశాల పీఈటీ పర్యవేక్షణలో మండల స్థాయిలో 28 నుండి 31 వరకు సీఎం కప్ మండల నోడల్ అధికారి, ఎంఈఓ ప్రసాదరావు పర్యవేక్షణలో పలు క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు.
పాల్గొనే వారు ఇంకా ఇప్పటికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని,రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆయా క్లస్టర్ స్థాయి క్రీడా వెన్యూ కోసం ఈ స్థానిక సెక్రటరీ ని సంప్రదించాలని అన్నారు.
- Advertisement -


