– ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ-ములుగు, గోవిందరావుపేట, తాడువాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ‘సమ్మక్క-సారలమ్మ’ గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించేందుకు హాజరైన, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి సీతక్క పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మేడారంలోని హరిత హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం ప్రారంభోత్సవంతో ఒక ఘట్టం ముగిసిందన్నారు. ఈ క్రమంలో 21వ తేదీ మొదలయ్యే మండే మెలిగే పండుగ నుంచి నిండు పండగ వరకు ఇలాగే విజయవంతం చేయాలని కోరారు. తల్లుల కీర్తిని ప్రపంచానికి చాటేలా కవరేజ్ చేసిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగే క్యాబినెట్ సమావేశాన్ని అడవిలోకి తీసుకొచ్చి ఏర్పాట్లు చేశామని, అంతేకాక ఆదివారం రాత్రి సీఎం కుటుంబం, మంత్రుల కుటుంబాలు ఇక్కడే బస చేశాయని తెలిపారు. రెండ్రోజుల పాటు యావత్ క్యాబినెట్ మేడారంలోనే ఉండటం, క్యాబినెట్ సమావేశాన్ని ఇక్కడే ఏర్పాటు చేసి పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రకటించడం ములుగుకు గర్వకారణమన్నారు. క్యాబినెట్ సమావేశాన్ని సక్సెస్ చేసిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అటెండర్ నుంచి చీఫ్ సెక్రెటరీ వరకు, హోంగార్డుల నుంచి డీజీపీ వరకు అందరూ కష్టపడి పని చేసి క్యాబినెట్ సమావేశాన్ని, సీఎం పర్యటనను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



