Tuesday, January 20, 2026
E-PAPER
Homeజాతీయంభారీగా తగ్గిన భారత్‌ వృద్ధిరేటు

భారీగా తగ్గిన భారత్‌ వృద్ధిరేటు

- Advertisement -

ఐఎంఎఫ్‌ అంచనాలు విడుదల

న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్‌ వృద్ధిరేటు బాగా తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ అంచనా వేసింది. 2025-26 సంవత్సరానికి అంచనా వేసిన 7.3శాతం నుంచి 6.4శాతానికి తగ్గుతుందని అంచనా వేసినట్టు ఒక నివేదికలో పేర్కొంది. తాము అంచనా వేసిన వృద్ధిరేటు 6.5శాతం అలాగే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొన్న కొద్ది రోజులకే ఐఎంఎఫ్‌ అంచనాలు వెలువడ్డాయి. తాత్కాలిక కారణాలు, అలాగే ఆర్థిక చట్రానికి సంబంధించిన కొన్ని అంశాలు క్షీణించడం వల్ల 2026, 2027ల్లో వృద్ధిరేటు 6.4శాతంగా వుంటుందని అంచనా వేసినట్లు ఐఎంఎఫ్‌ తన ప్రపంచ ఆర్థిక దృక్పథం (వరల్డ్‌ ఎకనమిక్‌ ఔట్‌లుక్‌) నివేదికను సవరిస్తూ చెప్పింది. అయితే అంతకుముందు అంచనాలు 6.2శాతం కన్నా కొద్దిగా మెరుగ్గా ఈసారి 6.4శాతంగా అంచనా వేసింది. 2025 మూడవ త్రైమాసికంలో భారతదేశ వృద్ధి అంచనాలను మించిపోయింది.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8.2శాతానికి పెరిగిపోయింది. దీంతో 2026 సంవత్సరానికి ఆర్బీఐ తన అంచనాలను 7.3శాతానికి సవరిం చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతదేశ జీడీపీ డేటా పద్దతులను ఆధునీకరించనున్నట్లు కూడా ఐఎంఎఫ్‌ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల వృద్ధిరేటు అంచనాల్లో సవరణలకు దారి తీయవచ్చని తెలిపింది. అదనంగా, ద్రవ్యోల్బణం లక్ష్యానికి సమీప స్థాయికి వస్తుందని ఆశిస్తోంది. ఇక అంతర్జాతీయంగా చూసినట్లైతే, మారుతున్న వాణిజ్య విధానాలు వంటి సవాళ్లు ఇంకా మిగిలివున్నప్పటికీ 2026లో వృద్ధిరేటు అంచనాలను 3.3 శాతానికి ఐఎంఎఫ్‌ పెంచింది. ఇందుకు సాంకేతిక రంగ పెట్టుబడులు ముఖ్యంగా ఏఐలో పెట్టుబడులు కారణమవుతాయని పేర్కొంది. మరోపక్క 2026 సంవత్సరానికి అమెరికా, చైనాల వృద్ధిరేటు అంచనాలను కూడా ఐఎంఎఫ్‌ పెంచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -