నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎం విద్యాసాగర్ (63) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. విద్యాసాగర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన నమస్తే తెలంగాణ పత్రికలో సీనియర్ ఫొటో జర్నలిస్టుగా పనిచేసి రిటైర్ అయ్యారు. గతంలో ఉషోదయం, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఏపీ టైమ్స్, హిందీ మిలాప్, వార్త పత్రికల్లో పనిచేశారు. విద్యాసాగర్ మరణవార్త తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు ఎ గంగాధర్, ప్రధాన కార్యదర్శి కెఎన్ హరి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. విద్యాసాగర్ కుటుంబ సభ్యులను పరామ ర్శించి ధైర్యం చెప్పారు. ఆయన మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం నాయకులు కె అనిల్ కుమార్, నక్కా శ్రీనివాసు లు, రజినీకాంత్, శ్రీనివాస్, నోహ సీలం, గాంధీ, జాన్, సుధీర్ తదితరులు సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విద్యాసాగర్ మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అడ్‌హక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
సీనియర్ ఫొటో జర్నలిస్టు ఎం విద్యాసాగర్ హఠాన్మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



