హైదరాబాద్ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల కంపెనీ ఒప్పో ఇండియా ఎఐ పోర్ట్రైట్ కెమెరా, ప్యూర్ టోన్ టెక్నాలజీ ఫీచర్లతో కూడిన సరికొత్త రెనో 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ 5జి ఫోన్ విభిన్నమైన ట్రావెల్ ఫోటోగ్రఫీ కోసం రూపొందించబడిన 200 ఎంపి అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరాను కలిగి ఉందని ఆ సంస్థ తెలిపింది. రెనో15 సిరీస్‌ను రెనో15 ప్రో, రెనో15 ప్రో మినీ, రెనో15 మూడు వేరియంట్‌లతో ఆవిష్కరించింది. యువ ప్రయాణికులు, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ సిరీస్‌లో ఆధునిక కెమెరా సిస్టమ్, ఇంటెలిజెంట్ ఎఐ, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయని ఒప్పో ఇండియా కమ్యూనికేషన్ హెడ్ గోల్టీ పట్నాయక్ తెలిపారు. వీటి ధరలు రూ.45,999 నుంచి ప్రారంభమవుతున్నాయి.



