Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్రైతన్న కష్టం నేలపాలు.!

రైతన్న కష్టం నేలపాలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి రైతన్నలు అగచాట్లు పడుతున్నారు. తాడిచెర్ల, మల్లారం, కొయ్యుర్, వళ్లెంకుంట, కొండంపేట, ఎడ్లపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్ముకోవడానికి అరబోసిన ధాన్యం, కాంటాలు పెట్టిన ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించకపోవడంతో తడిసి ముద్దాయింది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రంగుమారి, మొలకెత్తాయి. వానకాలం సీజన్ సాగుకు దగ్గరపడుతున్న మండలంలో యాసంగి ధాన్యం సేకరణ  మందకొడిగా సాగుతోంది.కాంటాలు సక్రమంగా జరగక వారాల తరబడి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాగరణ చేస్తున్నారు. అకాల వర్షాలు మాత్రం రైతులను ఆగం చేస్తున్నాయి.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే ప్రకృతి ప్రకోపంతో నెలపాలు అవుతుంటే పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -