- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉ.9 గం.-మ.12 వరకు, మ.3గం.-సా.6 వరకు 2 సెషన్స్ ఉంటాయి. హైదరాబాద్, సికింద్రబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ సహా రాష్ట్రంలో 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. 40వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
- Advertisement -



