Saturday, May 9, 2026
E-PAPER
Homeసినిమా4 గంటల్లోనే ఆల్‌టైమ్ రికార్డ్

4 గంటల్లోనే ఆల్‌టైమ్ రికార్డ్

- Advertisement -


విడుదలకు ముందే రామ్ చరణ్ నటించిన ‘పెద్ది` సంచలనాలు సృష్టిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తుఫాన్‌లా దూసుకెళ్తున్నాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం నాలుగు గంటల్లోనే సినిమా 100కె డాలర్ల మార్క్‌ను దాటేసి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఈ స్థాయి ఓపెనింగ్ రావడం సెన్సేషనల్ అయ్యింది. రామ్ చరణ్ స్టార్ పవర్‌పై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం, బుచ్చిబాబు స్టొరీ టెల్లింగ్ ప్రత్యేకత కలిసివచ్చి ఈ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి అని మేకర్స్ చెప్పారు. నార్త్ అమెరికా రిలీజ్ ప్రత్యంగిరా సినిమాస్ నిర్వహిస్తోంది. వారి రిలీజ్ ప్లానింగ్ కూడా భారీ స్థాయిలో ఉంది. నార్త్ అమెరికాతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ‘పెద్ది’ నుంచి విడుదలైన రెండు పాటలు, రెండు గ్లింప్స్, పోస్టర్లు.. ప్రతి అప్డేట్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే ఫైనల్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైతే ఈ హైప్ మరింత రెట్టింపు అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుండగా, జూన్ 3 నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -