నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల తెలంగాణ శాసనసభ గేటు వద్ద బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న తన పట్ల సదరు నేతలు అభ్యంతరకరంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించారని మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


