వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ వయసు పైబడిన రాయల్ లుక్‌లో కనిపించారు. పోస్టర్ మొత్తం సైకలాజికల్ డ్రామాకు తగ్గట్టుగా ఇంటెన్స్ వాతావరణాన్ని చూపించింది. ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా, వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బి, డీఓపీ : కార్తీక్ పర్మార్, సంగీతం: స్మరణ్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్.
వైవిధ్యమైన సైకలాజికల్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -



