నవతెలంగాణ- మల్హర్ రావు
ఆదర్శ పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థుల భవిష్యత్ బంగారంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా ముందుకూ వెళుతున్నట్టుగా మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు తెలిపారు. ప్రయివేటు ధీటుగా నాణ్యమైన విద్య,మధ్యాహ్న భోజనం,పాఠ్య పుస్తకాలు ఉచితంగా, సకల సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉంటుందని తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంర్మీడియట్ వరకు, ఇంటర్ బాలికలకు వసతి గృహం ఉందన్నారు.
ఆదర్శంలో దరఖాస్తులు ఇలా..
అర్హత గల విద్యార్థులు దరఖాస్తులను టీఎస్ ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో http://telanganams.cgg.gov.in/వెబ్సైట్లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ విద్యార్థులు రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
రిజర్వేషన్లు..
ప్రతీ తరగతిలో 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీ లకు, 29 శాతం బీసీలకు (బీసీ గ్రూప్ ఏ 7 శాతం, – బీ-10 శాతం, సీ-1 శాతం, డీ-7 శాతం, ఈ-4 శాతం), దివ్యాంగులకు 3 శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించారు. నిర్దేశించిన విభాగాల్లో అభ్యర్థులు లేనిపక్షంలో ఇతర గ్రూపుల నుంచి భర్తీ చేస్తారు. మిగిలిన 50 శాతం సీట్లను ఇతర కులాలకు ఓపెన్ కేటగిరీలో నిర్ధేశించారు.
రాత పరీక్ష..
ఆరోతరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ 19న ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆయా ఆదర్శ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో తెలుగు, ఆం గ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ఐదో తరగతి సామ ర్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఇంగ్లీషులో 25 మార్కుల చొప్పున 100 మార్కులు ఐచ్ఛిక తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఓసీ, బీసీలు 50, ఎస్సీ, ఎస్టీలు 35 మార్కులు తప్పక సాధించాలి.7, 8, 9, 10 తరగతుల్లో ప్రవేశానికి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.ఏప్రిల్ 9 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసు కోవచ్చు.
మే 13న ఫలితాల వెల్లడి..
23న రోస్టర్ సెలక్ట్ లిస్ట్ ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు అందజేస్తారు.29న ప్రవేశాలకు సంబంధించిన పట్టికను జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ప్రకటిస్తారు. 31న సంబంధిత పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ఆయా పాఠశాలల నోటీ స్ బోర్డుపై ఉంచుతారు. జూన్ 1 నుంచి 5 వరకు విద్యార్థుల నిజధ్రువీకర ణ పత్రాలను పరిశీలిస్తారు. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.



