జెనీవాలో కొద్ది రోజుల క్రితం జరిగిన అమెరికా-చైనా పన్నుల ఒప్పంద పరిణామాలు, పర్యవసానాలు ఆ రెండు దేశాల మీద ఎలా ఉండేదీ ముందు ముందు చూడాల్సి ఉంది.అది నేర్పిన పాఠం ఏమిటంటే మనం కూడా చైనా మాదిరి గట్టి ఎత్తుగడలను ఎందుకు అనుసరించ కూడదు అనే ఆలోచనకు దోహదం చేయటం ఆహ్వానించదగిన పరిణామం.ఇప్పుడు భూభౌతిక రాజకీయ బలాబలాల్లో ఎన్ని దేశాలు అమెరికా అదిరింపులు బెదిరింపులను తట్టుకొని నిలుస్తాయన్న ప్రశ్న ఎలాగూ ఉంటుంది, అయినప్పటికీ ఒకసారి అలాంటి ఆలోచన మొదలైన తర్వాత కచ్చితంగా ప్రయత్నమైతే చేస్తాయి. అమెరికా 145 నుంచి 30, చైనా 125 నుంచి పది శాతానికి ప్రకటించిన ప్రతి సుంకాలను తగ్గించేందుకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రకటించిన మూడు నెలల విరామం జూలైలో ముగియనుంది, అయినప్పటికీ ఒప్పందం కోసం అమెరికా అర్రులు చాచటంతో జెనీవాను వేదికగా నిర్ణయించారు. కనీసం 150 దేశాలు తమతో సంప్రదింపుల కోసం వరుసలో నిలిచినట్లు ట్రంప్ గొప్పగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. చైనాను పొడిచేస్తా అది చేస్తా అని ప్రగల్భాలు పలికిన అమెరికా పెద్ద హడావుడి లేకుండా జెనీవా విమాన మెక్కటం దాని తొలి పరాజయం.
చైనా ధృడవైఖరి అనేక దేశాలను ఆశ్చర్యపరచింది, ఏమి చూసుకొని అమెరికాతో పెట్టుకుంటున్నది అని తలలు పట్టుకున్నవారు కూడా లేకపోలేదు.దీర్ఘకాలం కలసి కాపురం చేసిన తర్వాత ఎవరి బలాలు బలహీనతలేమిటో పరస్పరం తెలుస్తాయన్నది తెలిసిందే, అదే విధంగా చైనా-అమెరికా వాణిజ్య సంబంధాల చరిత్ర నేర్పుతున్న పాఠమిదే. అమెరికాకు అగ్రస్థానం పేరుతో అతిగా ప్రవర్తించి అభాసుపాలైనట్లు ట్రంప్‌కు తెలిసి వచ్చి దిగివస్తున్నాడన్నదే ఒక్క ముక్కలో జెనీవా చర్చల సారం, చైనా అనుసరించింది సరైన మార్గమని భావిస్తున్నారు. దాంతో బహిరంగంగా వెల్లడించక పోవచ్చుగానీ అమెరికాతో ఆడే ఆటలో ఎన్ని తురుపు ముక్కలను ఎలా ప్రయోగిం చాలో ఎత్తువేసేందుకు, గట్టిగా నిలిస్తే తమకు ఎంత లాభం,నష్టం అనే లెక్కలో కొన్ని దేశాలు పడ్డాయంటే అతిశయోక్తి కాదు. దీనిలో భాగంగానే గత వారంలో దక్షిణ కొరియాలో జరి గిన ప్రాంతీయ సమావేశానికి అమె రికా వాణిజ్య ప్రతినిధి వచ్చిన కారణ ంగా ముఖం చాటేసేందుకు జపాన్ ప్రతినిధి రాలేదని వార్తలు వచ్చాయి.
జూన్‌లో అమెరికాతో ఒప్పందం చేసుకోబోతున్నట్లు ఇటీవల జపాన్ ప్రతి నిధి చెప్పాడు. అయితే జూలై వరకు వేచి ఉండాలని నిర్ణ యించినట్లు తాజాగా మీడియా పేర్కొన్నది. ఈ ఏడాది అక్టోబరు నాటికి ఒప్పందం కుదుర్చుకుంటామని లీకులు వదిలిన మన వాణిజ్య మంత్రి పియూష్ గోయాల్ ప్రస్తుతం వాషింగ్టన్ పర్యటనలో ఉన్నారు. జపాన్, దక్షిణ కొరియాలతో చర్చలకు సమయం పడుతుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పాడు, ఐరోపాతో కూడా నెమ్మదిగానే మాటలుంటాయన్నాడు. కొందరు మినహా అనేక దేశాలు మంచి ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నాయని చెప్పుకున్నాడు. ఇప్పటి వరకు చైనా, బ్రిటన్‌తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాలను చూస్తే సమస్యలు పూర్తిగా పరిష్కారమైనట్లు కాదని, వాణిజ్య చిత్రం రోజురోజుకూ చీలిపోతున్నదని ఐరోపా సమాఖ్య ఆర్థికవేత్త వాల్డిస్ వ్యాఖ్యానించాడు.
లాటిన్ అమెరికా సమస్య భిన్నమైనది. దానికి చైనా నుంచి వచ్చే పెట్టుబడులు కావాలి, తమ ఎగుమతులకు అమెరికా మార్కెట్ అవసరం.అందుకని ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హడావుడి చేయకుండా తమపని తాము చేస్తున్నాయి.ప్రతి సుంకాలకు ముందు సంప్రదింపుల గురించి మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా ఇటీవల చైనా పర్యటనకు వెళ్లి 30కి పైగా ఒప్పం దాలు కుదుర్చుకు రావటం అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. అమెరికా తమకు ప్రధాన మిత్రదేశమే అని దౌత్యవేత్తలు ఒకవైపు చెబుతుండగానే కొలంబియా అధ్యక్షుడు గుస్తావ్ పెట్రో కూడా గతవారం బీజింగ్ సందర్శనలో ఒప్పందాలు చేసుకున్నాడు. మొత్తం మీద అన్ని దేశాలకు ఒక్కటి అర్ధమైంది. ఎంతవారలైనా కాంతదాసులే అన్నట్లుగా పైకి ఎన్ని బింకాలు పలికినా అంతర్గతంగా తలెత్తిన ఆర్థిక వత్తిళ్లకు లొంగిపోవటం ట్రంపునకూ తప్పదని తేలిపోయింది. మబ్బు లను చూసి చేతిలోని ముంత నీళ్లు ఒలకపోవటం అవసరమా అన్నట్లుగా విదేశీ వస్తువుల మీద వేసే పన్నులతో వచ్చే రాబడి సంగతి తర్వాత మనమీద పడే భారాన్ని ఎవరు భరించాలన్న చర్చ, వినియోగదారులపైనే పడనుందన్న భయంతో అమెరికాలో వ్యతిరేకత, అంతర్జాతీయంగా దేశాలను బెదిరించే స్థితిలో లేమన్న వాస్తవం ట్రంప్‌ను రాజీకి దిగివచ్చేట్లు చేస్తున్నాయని చెప్పవచ్చు.
ప్రపంచానికి చైనా పాఠం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES