- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను కనీసం 90 రోజుల ముందే జారీ చేయాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు టికెట్ ధరల పెంపు విషయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఈ ఉత్తర్వులను న్యాయవాది విజయ్ గోపాల్ సవాల్ చేశారు. ‘రాజాసాబ్’ సినిమా అంశంపై 9న వాదనలు జరిగితే, 8న ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ ధరలపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం దీనిపై విచారణను వాయిదా వేసింది.
- Advertisement -



