నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. దుస్తులు ఉతుకుతున్న తల్లి, కొడుకుపై దోపిడి దొంగలు అరాచకం సృష్టించారు. రాళ్లతో దాడికి దిగి తల్లి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం, రాంనగర్ కాలనీలో గల దోబీ ఘాట్ వద్ద మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడే బట్టలు ఉతుకుతున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న కొడుకు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వృద్ధురాలైన తల్లి, కొడుకుల పై దుండగులు దాడి చేసి వృద్ధురాలు మెడలో నగలు ఎత్తుకెళ్లారు. వృద్ధురాలికి, ఆమె కొడుకుకు తీవ్ర గాయాలై రక్తస్రావం అవ్వగానే స్థానికులు గమనించి మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పట్టపగలై దోపిడీ దొంగలు బీభత్సం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



